స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (SBI) తమ ఖాతాదారులకు షాకిచ్చింది. ఏటీఎంలలో ఇప్పటివరకు నెలకు అందుబాటులో ఉన్న ఉచిత లావాదేవీల సంఖ్యను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు నెలకు ఉచితంగా పొందుతున్న 10 లావాదేవీల పరిమితిని ఇకపై 5కు తగ్గిస్తూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.