TG: దసరా సెలవులు ముగియడంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం అందించాయి. అయితే, వీకెండ్ కావడంతో సొంతూళ్ల నుంచి ఇంకా తిరిగి రాని వారు, సోమవారం (అక్టోబర్ 26) నుంచే పిల్లలను బడులకు పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే గురువారం నుంచే పాఠశాలలు ప్రారంభమయ్యాయి.