AP: నాగుల చవితి పండుగ వేళ విశాఖపట్నంలోని మధురవాడ లా-కాలేజ్ కూడలి వద్ద శుక్రవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోవాడ వద్ద నాగుల చవితి వేడుకలకు స్కూటీపై వెళ్తున్న అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్ను ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో అమృత వర్షిని (21) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె సోదరి ఆదిత్య హర్షిణి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చ
ేసి, దర్యాప్తు చేస్తున్నారు.