AP: విశాఖలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సత్తారు బ్రిడ్జి వద్ద స్కూటీ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పిలకవానిపాలేనికి చెందిన అప్పలరెడ్డి(35)గా గుర్తించారు. అప్పలరెడ్డి పెందుర్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.