ఝార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో రాంచీ-పట్నా హైవే (NH-33)పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బిహార్‌లోని నలందా జిల్లాకు చెందిన 14 మంది ప్రయాణిస్తున్న స్కార్పియో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో 13 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. రామ్‌గఢ్‌లోని ప్రసిద్ధ రాజ్ రప్పా ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.