
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక అడ్వైజరీ
విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. లైసెన్స్ లేని ఏజెంట్లను మూసివేసి, మానవ అక్రమ రవాణా కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో ఉద్యోగ ప్రకటనలు, చెల్లింపులపై సైబర్ నిఘా ఉంచి, డిజిటల్ ఆధారాలను సీజ్ చేయాలని సూచించింది. 'e-Migrate' పోర్టల్ ద్వారా అవగాహన కల్పించి, గ్రామ పంచాయతీలను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సూచనలు జారీ చేసింది.




