తమిళనాడు సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని ఆయన చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం విజయ్ తన ఆదాయ, భూ యాజమాన్య వివరాలను పూర్తిగా, కచ్చితంగా వెల్లడించలేదని ఆరోపిస్తూ ఎస్.దినేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని, ప్రాథమిక దశలోనే కేసును కొట్టివేయలేమని జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.