బీహార్లోని లఖిసరాయ్ జిల్లా అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటుచేసుకుంది. పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.