TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు 29 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గద్వాల, ఖమ్మం, సూర్యాపేట, జనగామ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కనిష్ఠంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల వరకు పడిపోవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.