మహారాష్ట్రలో నిషేధిత పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు రాష్ట్ర ఎఫ్‌డీఏ జారీ చేసిన నోటీసులపై వారు స్పందించారు. ముగ్గురు నటులు తమ సమాధానాలను సమర్పించగా.. ఇద్దరు వ్యక్తిగత విచారణ కోరినట్లు అధికారులు తెలిపారు. ఆ విచారణ కూడా పూర్తయిందన్నారు. ‘విమల్ ఇలాచీ’ ప్రకటనల ద్వారా నిషేధిత ఉత్పత్తులను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్‌డీఏ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నటులు కాంట్రాక్టులు, పారితోషిక వివరాలు సమర్పించాలని గతంలో నోటీసుల్లో కోరింది.