శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భోగి’. సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాను నవంబర్ 12న విడుదల చేయాలని ముందుగా నిర్ణయించారు. సెన్సార్ బోర్డు సమస్య తలెత్తడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.