గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికేసింది

4చూసినవారు
గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికేసింది
సంతానం కలగలేదని ‘గొడ్రాలివి’ అంటూ నిత్యం వేధిస్తున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కెంపేగౌడనగర లక్ష్మీపురకు చెందిన రాజశేఖర్‌ (32), మాలాశ్రీ (30) దంపతులకు వివాహమై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. దీంతో మద్యం తాగి వచ్చిన రాజశేఖర్‌ తరచూ భార్యతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో మాలాశ్రీ వంటింట్లోని కత్తితో భర్తపై దాడి చేసింది. తీవ్ర గాయాలైన రాజశేఖర్‌ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసులు మాలాశ్రీని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్