నిద్రలేమితో బాధపడుతున్నవారికి అవగాహన పెంచేందుకు ‘కోలా స్లీప్ జపాన్’ అనే సంస్థ టోక్యోలో ‘మ్యాట్ రేస్’ పేరుతో వినూత్న పోటీ నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొన్నవారు 90 నిమిషాలు బెడ్‌పై నిద్రపోయారు. స్లీప్ ట్రాకింగ్ ద్వారా ఎవరు వేగంగా గాఢ నిద్రలోకి జారుకున్నారనేది గుర్తించి విజేతను నిర్ణయించారు. ఈ పోటీలో 'సుయిమీ' అనే యువతి గెలిచి రూ.12లక్షలు (2M యెన్లు) పొందారు.