హిమాచల్ ప్రదేశ్‌లోని నలాగఢ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన పార్క్ చేసిన జీపును బలంగా ఢీకొట్టింది. దీంతో జీపు బోల్తాపడి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయా? ఆమె ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.