SHOCKING VIDEO: తృటిలో తప్పిన ప్రమాదం

26చూసినవారు
కేరళలోని తిరువనంతపురం జిల్లా మన్నార్‌కోణం సమీపంలో నెడుమంగాడ్‌–వితుర రోడ్డుపై కారు అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. దుకాణం సమీపంలో ఓ మహిళ చిన్నారిని ఎత్తుకుని మరో ఇద్దరితో మాట్లాడుతుండగా కారు ఒక్కసారిగా మీదకి దూసుకొచ్చింది. వెంటనే వారు అప్రమత్తం అవ్వడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్