అమెరికాలో కాల్పులు.. 9 మంది మృతి

9చూసినవారు
అమెరికా పెన్సిల్వేనియాలోని ఈరీ సిటీలో ఓ ఇంటి వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణి ఉన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దుండగుడు ఇంటి బయట ఇద్దరు మహిళలను కాల్చి చంపి.. తర్వాత లోనికి వెళ్లి పలువురిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులకు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్