అమెరికాలోని ఫ్లోరిడాలో ఫుట్బాల్ మ్యాచ్ అనతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 12 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.