బొప్పాయిని రోజులో ఏ సమయంలో తిన్నా దాదాపు అవే లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫరీదాబాద్లోని అమృతా ఆసుపత్రి క్లినికల్ న్యూట్రిషన్ విభాగాధిపతి చారు దువా అందించిన సమాచారం ప్రకారం, బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలకు కారణం దానిని తినే సమయం కాదు, దానిలో ఉండే పోషకాలే. 'టైమ్స్ ఆఫ్
ఇండియా' కథనం ప్రకారం, బొప్పాయిని పరగడుపున తినడం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని చెప్పడానికి ఎటువంటి క్లినికల్ ఆధారాలు లేవని నిపుణులు తేల్చిచెబుతున్నారు.