అందోల్ నియోజకవర్గం - Andhole Constituency

పేదలకు పెద్ద భరోసా చేయూత పింఛన్ - మంత్రి దామోదర

పేదలకు పెద్ద భరోసా చేయూత పింఛన్ - మంత్రి దామోదర

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం మునిపల్లిలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ తో కలిసి 1, 213 మందికి పింఛన్ పత్రాలు పంపిణీ చేశారు. మునిపల్లిలో 629, రాయికోడ్‌లో 584 మందికి పింఛన్లు మంజూరయ్యాయి. జిల్లాలో 18, 591 కొత్త పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. పింఛన్ డబ్బు మాత్రమే కాదని, పేదలకు భరోసా అన్నారు. అందోల్‌లో 60 గ్రామాల అభివృద్ధి, మునిపల్లి, కంకోల్, సింగీతంలో 24 గంటల వైద్య సేవలు, మహిళా సాధికారతపై మాట్లాడారు. మహిళా సంఘాల రుణాల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. 19 నుంచి రూ. 5 లక్షల ఇందిరమ్మ బీమాకు దరఖాస్తులు ప్రారంభమవుతాయని అన్నారు.

వీడియోలు


సంగారెడ్డి జిల్లా
Top 10 viral news 🔥
రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు
Nov 18, 2026, 00:11 IST/

రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా.. నేటి నుంచే దరఖాస్తులు

Nov 18, 2026, 00:11 IST
తెలంగాణ ప్రభుత్వం కోటికిపైగా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని నవంబర్ 19 నుంచి ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. కుటుంబంలో సంపాదించే ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుంది. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు అర్హులు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు దరఖాస్తులు, నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామాలు, వార్డుల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా నమోదు చేస్తారు.