బెజ్జంకి మండలం - Bejjanki Mandal

సిద్దిపేట జిల్లా
Sep 06, 2026, 16:09 IST/

బస్సులో మరిచిపోయిన రూ.3 లక్షలను ప్రయాణికుడికి అందించిన కండక్టర్

Sep 06, 2026, 16:09 IST
TG: బస్సులో మరిచిపోయిన రూ.3 లక్షల నగదును ప్రయాణికుడికి అందించి నిజాయితి చాటుకున్నారు ఓ మహిళా కండక్టర్. షాద్‌నగర్‌కు చెందిన RTC బస్సులో ప్రయాణికుడు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారవేత్త జహంగీర్ రూ. 3 లక్షల నగదును మర్చిపోయాడు. అఫ్జల్‌గంజ్ వద్ద జహంగీర్ బస్సు దిగారు. అయితే కండక్టర్ సరిత డబ్బులు ఉన్న బ్యాగ్‌ను గమనించి డ్రైవర్ నరసింహులు సాయంతో భద్రపరిచారు. నగదు బ్యాగ్‌ను మర్చిపోయానని గుర్తించిన జహంగీర్ తిరిగి వెళ్లాడు. సదరు వ్యక్తి వివరాలు ఆరా తీసి కండక్టర్ అతనికి డబ్బులు అందజేశారు.