Sep 21, 2026, 05:09 IST/సిద్దిపేట
సిద్దిపేట
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
Sep 21, 2026, 05:09 IST
సిద్దిపేట జిల్లా, కోహేడ మండలం వరికోలు గ్రామంలో సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో 15 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 5. 63 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు శనిగరం తిరుపతి, సర్పంచ్ సుదగోని దేవరాజ్, ఉపసర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంతల శివారెడ్డి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.