దౌల్తాబాద్ మండలం - Doultabad Mandal

సిద్దిపేట జిల్లా
చెక్‌డ్యామ్‌ కం బ్రిడ్జిపై నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీరు
Sep 28, 2026, 16:09 IST/హుస్నాబాద్
హుస్నాబాద్

చెక్‌డ్యామ్‌ కం బ్రిడ్జిపై నుంచి దిగువకు ప్రవహిస్తున్న నీరు

Sep 28, 2026, 16:09 IST
ధూళిమిట్ట మండలంలోని తోర్నాల గ్రామ మోహి తుమ్మెద వాగుపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మించిన చెక్‌డ్యామ్‌ కం బ్రిడ్జి నిండుకుండలా మారి నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వాగలబోయిన పరశురాములు ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మండల అధ్యక్షుడు కోల సాయిలు, ప్రస్తుత మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పాల్గొని గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు.