Sep 06, 2026, 15:09 IST/
ఈ జిల్లాల్లో వర్షాలు.. ALERT
Sep 06, 2026, 15:09 IST
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో సోమవారం ఉదయం 8.30 వరకు మోస్తరు వానలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.