దుబ్బాక - Dubbaka

చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామంలో ముదిరాజ్ సిద్ధిరాములు (35) అనే వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం నుంచి కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులోని చెరువులో లభ్యమైంది. చేపల వేటకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెంది ఉండవచ్చని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉండగా ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది.

వీడియోలు


సిద్దిపేట జిల్లా
అమెరికాలో ఆర్థిక సంక్షోభం.. భారత్‌కు వస్తున్న NRIలు
Oct 13, 2026, 06:10 IST/

అమెరికాలో ఆర్థిక సంక్షోభం.. భారత్‌కు వస్తున్న NRIలు

Oct 13, 2026, 06:10 IST
అమెరికాలో ఆర్థిక సంక్షోభం, H-1B వీసా నిబంధనల కఠినతరం, I-140 పిటిషన్ల తిరస్కరణ వంటి కారణాలతో భారతీయ సాఫ్ట్‌వేర్ నిపుణులు, ముఖ్యంగా తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, భారీ అద్దెలు, పెరిగిన వడ్డీ రేట్లతో ఇళ్లు, కార్లు అమ్ముకోలేక, దిక్కుతోచని స్థితిలో రాత్రికి రాత్రే భారత్‌కు తిరిగి వస్తున్నారు. ఒకప్పుడు కోటి రూపాయల వేతనం అందుకున్నవారు ఇప్పుడు 35 లక్షల ప్యాకేజీతో సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి 2008 ఆర్థిక మాంద్యాన్ని తలపిస్తోందని ప్రవాస సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.