
మళ్లీ గజ్వేల్‌కు వస్తా.. ఒకరోజంతా మీతోనే ఉంటా..కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మనగూడ ఎస్4 వద్ద పార్టీ శ్రేణులను గురువారం కలుసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడిన కేటీఆర్ మళ్లీ ఒకసారి గజ్వేల్‌కు వస్తా ఒకరోజంతా మీతోనే ఉంటా అని హామీ ఇచ్చారు. ఈ హామీతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. అక్కడి నుంచి గోదావరిఖనిలో జరగనున్న సింగరేణి కార్మిక గర్జన బహిరంగ సభకు భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు.



























