Oct 10, 2026, 11:10 IST/
రేడియల్ రోడ్ల టెండర్ల వ్యవహారంపై సీఎం రేవంత్కు KTR లేఖ
Oct 10, 2026, 11:10 IST
TG: రేడియల్ రోడ్ల టెండర్ల వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. టెండర్లలో జరిగిన కుంభకోణంపై CM సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పనుల్ని ప్యాకేజీలుగా, ముక్కలుగా చేసి నచ్చిన వారికే కట్టబెట్టారని, ఇందులో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటనే టెండర్లను రద్దుచేసి అక్రమాలపై విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.