మద్దూరు - Madduru

సిద్దిపేట జిల్లా
హుస్నాబాద్‌ చికెన్ వేస్ట్ టెండర్లపై వివాదం
Oct 16, 2026, 15:10 IST/హుస్నాబాద్
హుస్నాబాద్

హుస్నాబాద్‌ చికెన్ వేస్ట్ టెండర్లపై వివాదం

Oct 16, 2026, 15:10 IST
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో 2026-27 సంవత్సరానికి గాను చేపట్టిన చికెన్ వ్యర్థాల టెండర్ల ప్రక్రియ వివాదానికి దారితీసింది. శుక్రవారం నాడు జరిగిన ఈ ప్రక్రియపై బీఎస్పీ నాయకుడు పి. రవీందర్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపల్ ఏఈ మరియు కొందరు కౌన్సిలర్లు కుమ్మక్కై, ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండానే టెండర్ నోటీసులను రహస్యంగా ఉంచి వేలం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది మున్సిపాలిటీకి ఆర్థిక నష్టం కలిగించే కుట్ర అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.