
ప్రైవేట్ బస్సు - బైక్ ఢీ.. పలువురికి గాయాలు!
రహదారిపై జరిగిన ప్రమాదం పలువురిని గాయాలపాలు చేసింది. నిజాంపేట మండలం నార్లాపూర్ శివారులో ప్రైవేట్ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో బచ్చు రాజుపల్లి గ్రామానికి చెందిన చిమ్మణమైన సతీష్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న నిజాంపేట అంబులెన్స్ సిబ్బంది స్వామి వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
































