
కల్హేర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్హేర్ మండల పరిధిలోని మహదేవ్ పల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2, 461, సాధారణ రకానికి రూ. 2, 441 మద్దతు ధర, సన్న వడ్లకు అదనంగా రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



































