
ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
శివ్వంపేట మండలం శంకర్ తండాలో మాలోత్ శంకర్ (45) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బోరు మోటారు కాలిపోయి, మరమ్మతు చేయించి దించుతుండగా నాలుగు పైపులతో సహా పడిపోయింది. అది తీయడానికి ఎవరు రాకపోవడంతో గొడవలు జరిగాయి. ఇంట్లో కుటుంబీకులు కొట్టడం, వరి పంట ఎండిపోవడంతో మంగళవారం రాత్రి పొలం వద్దకు వెళ్ళాడు. మనస్తాపానికి గురై అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.























