Sep 05, 2026, 17:09 IST/సిద్దిపేట
సిద్దిపేట
తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా జలంధర్ బాధ్యతలు స్వీకరణ
Sep 05, 2026, 17:09 IST
సిద్దిపేట జిల్లా తొగుట మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా పనిచేసిన మేకల జలంధర్, తొగుట బ్రాంచ్ నుండి బోధన్ బ్రాంచ్ -223 నిజామాబాద్ రీజియన్ కు AMH మేనేజర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ ప్రణీత్, క్యాషియర్ రవికుమార్, ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ శ్రీకాంత్, తొగుట సిఎఫ్ఎల్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఆయనను సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.