Oct 10, 2026, 17:10 IST/గజ్వేల్
గజ్వేల్
బైలంపూర్ గ్రామం లో బతుకమ్మ ఏర్పాట్లు
Oct 10, 2026, 17:10 IST
సిద్దిపేట జిల్లా, గజ్వేల్ పరిధిలోని ములుగు మండలం, బైలంపూర్ గ్రామంలో శనివారం బతుకమ్మ పండుగ ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ మచ్చల కృష్ణ పరిశీలించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు జరుపుకునేలా గ్రామంలోని ప్రధాన చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణతో పాటు ఉపసర్పంచ్ కనకయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.