Sep 26, 2026, 17:09 IST/సిద్దిపేట
సిద్దిపేట
కరెంట్ షాక్తో రైతు ఎద్దు మృతి: లక్షల్లో నష్టం, అధికారులకు విజ్ఞప్తి
Sep 26, 2026, 17:09 IST
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామంలో శనివారం సాయంత్రం రైతు దుంబాల నరసింహులుకు చెందిన ఎద్దు కరెంటు షాక్తో మృతి చెందింది. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. విద్యుత్ వైర్లు స్తంభాల నుండి కిందికి ఉండటమే దీనికి కారణమని పేర్కొన్నారు. అధికారులు స్పందించి రైతును ఆదుకోవాలని కోరారు.