Sep 26, 2026, 12:09 IST/
భారీ డిమాండ్ కారణంగానే బుకింగ్‌లో పోటీ: TTD
Sep 26, 2026, 12:09 IST
తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్ బుకింగ్‌పై భక్తుల్లో నెలకొన్న సందేహాలకు TTD వివరణ ఇచ్చింది. అధిక డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న కోటాతో పోలిస్తే డిమాండ్ దాదాపు 9 రెట్లు అధికంగా ఉండటంతో టికెట్లు తక్కువ సమయంలోనే పూర్తవుతున్నాయని పేర్కొంది. టికెట్ లభించకపోవడాన్ని, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పని చేయకపోవడాన్ని ఒకటిగా పరిగణించరాదని TTD స్పష్టం చేసింది.