
రాగి వర్ణం నుండి నీలి రంగులోకి గోదావరి జలాలు (వీడియో)
AP: పోలవరం దగ్గర గోదావరి నది జలాల రంగులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జులై నుండి అక్టోబర్ మొదటి వారం వరకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటిలో మట్టి, ఇసుక కణాలు కలవడంతో నదీజలాలు రాగి రంగులో ఉండేవి. అక్టోబర్ రెండో వారం నాటికి వరద ప్రవాహం తగ్గడంతో నదిలోకి మట్టి చేరడం ఆగిపోయింది. దీనివల్ల ఇప్పుడు గోదావరి జలాలు నీలి రంగులోకి మారాయి. ప్రస్తుతం శీలేరు నుండి వస్తున్న నీరు కూడా నీలి రంగులో ఉండటంతో పోలవరం స్పిల్వే వద్ద నది స్వచ్ఛంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది.




