దీపావళి, ధన్తేరస్ పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలుదారులకు ఊరటనిచ్చేలా ధరలు తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్లో కేవలం నాలుగు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.16,503 తగ్గింది. అక్టోబర్ 16న రూ.2,10,918గా ఉన్న వెండి ధర శుక్రవారం నాటికి రూ.1,94,415కు చేరింది. అటు బంగారం ధర కూడా దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,630కు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,230గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల,
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు ఈ పతనానికి కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.