వయసుతో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం సహజం. అయితే, ఎయిమ్స్ న్యూరోసర్జన్ డాక్టర్ అరుణ్ ఎల్. నాయక్ సూచించిన కొన్ని సులభమైన అలవాట్లతో మెదడును చురుకుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గాఢమైన నిద్ర, ఉదయపు ఎండలో గడపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. సప్లిమెంట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.