
కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
TG: హైదరాబాద్ బౌరంపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మంటల్లో ఓ కారు పూర్తిగా దగ్దమవగా అందులోని వ్యక్తి సజీవదహనమయ్యారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజ్ర అపార్ట్మెంట్ వెనకాల ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న కార్తీక్ రాధాకృష్ణ (40) అనే వ్యక్తి బయటికి రాలేక అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునారు.




