తెలంగాణలో మరోసారి ‘సర్‌’ గడువు పొడిగింపు

69చూసినవారు
తెలంగాణలో మరోసారి ‘సర్‌’ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హుల నమోదు కోసం గడువును మరోసారి పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ గడువు డిసెంబర్‌ 10తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దానిని డిసెంబర్‌ 22 వరకు పొడిగించినట్లు సీఈవో వెల్లడించారు. ఈ అవకాశం ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునే అర్హులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్