హుజురాబాద్ - Huzurabad

టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉదయ్ అరెస్ట్

టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉదయ్ అరెస్ట్

కరీంనగర్‌లో ఉంటున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వివాహితపై, ఆమె 10వ తరగతి స్నేహితుడు, హైదరాబాద్ 8వ బెటాలియన్ టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉదయ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రహస్యంగా వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేసి, రూ. 1. 3 లక్షలు వసూలు చేశాడు. భర్తకు వీడియోలు చూపడంతో ఆమెను ఇంటి నుంచి పంపించేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీజీఎస్పీ కానిస్టేబుల్ ఉదయ్‌ను అరెస్ట్ చేశారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా