
జగిత్యాల హైవేపై ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్రగాయాలు
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తా వద్ద జగిత్యాల–కరీంనగర్ హైవేపై శుక్రవారం జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన హీరాలాల్, ఆయన కుమారుడు సంస్కార్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

































