కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో ఎలుగుబంటి సంచరించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కేకలకు ఎలుగుబంటి గుట్టపైకి వెళ్లిపోయింది. ఇటీవల ఓ ఇంటి రేకులపైకి ఎక్కిన ఘటనతో పాటు, తరచూ జనావాసాల్లోకి వస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎలుగుబంటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరుతున్నారు.