
ఓటరు హక్కుల పరిరక్షణకు యూత్ కాంగ్రెస్ నిరసన
కథలాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాత నవీన్ మాట్లాడుతూ అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణలపై పారదర్శక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కుల పరిరక్షణకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి రాధాకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
































