తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క!

17251చూసినవారు
తమ్ముడి మృతదేహానికి రాఖీ కట్టిన అక్క!
మహబూబాబాద్ జిల్లా కురవిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కురవి గ్రామానికి చెందిన మోటపోతుల రమేశ్‌ (36) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బుధవారం ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రమేశ్‌ సోదరి ధనలక్ష్మి తన తమ్ముడి మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘రాఖీ కట్టక ముందే పాడెనెక్కావా తమ్ముడూ’ అంటూ రోదిస్తూ పాడెపై ఉన్న రమేశ్‌ చేతికి రాఖీ కట్టారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

సంబంధిత పోస్ట్