
పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు (VIDEO)
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. 16 కోచ్ల ఈ రైలు ఎస్ఎంవీటీ బెంగళూరు నుంచి బయలుదేరి సోమవారం ఉదయం ముంబైకి చేరుకోనుంది. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. నవంబర్ 2 నుంచి వారానికి ఆరు రోజులు అందుబాటులో ఉండే ఈ రైలు, అనంతపురం, గుంతకల్, పూణె వంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణ రైలు నవంబర్ 3న ముంబై నుంచి ప్రారంభం కానుంది.




