AP: తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఒక స్మార్ట్ ఆలోచన చేసింది. ఉచిత విద్యుత్ బస్సుల వివరాలను సులభంగా తెలుసుకునేందుకు స్మార్ట్ బస్టాప్‌లను ఏర్పాటు చేయనుంది. ఈ బస్టాప్‌లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. త్వరలోనే ప్రతి మూడు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.