ఏఐ కంపెనీల నుంచి మెమరీ చిప్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో స్మార్ట్ఫోన్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని జెఫరీస్ సంస్థ అంచనా వేసింది. ముఖ్యంగా బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు 30 శాతం వరకు పెరగవచ్చని తెలిపింది. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కోసం చిప్‌ల అవసరం పెరగడంతో తయారీ ఖర్చులు అధికమవుతున్నాయని పేర్కొంది. ఈ భారాన్ని మొబైల్ కంపెనీలు వినియోగదారులపైకి బదిలీ చేస్తున్నాయని వెల్లడించింది. 2027లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.