
రైతులకు కేంద్రం శుభవార్త... ఎరువుల కోసం రూ.62 వేల కోట్లకు పైగా సబ్సిడీ!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 11న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో రైతులకు మేలు చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. 2026-27 రబీ సీజన్‌కు గాను ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై రూ.62,370 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఆమోదించింది. గత రబీ సీజన్‌తో పోలిస్తే అదనంగా రూ.24,417.73 కోట్లు కేటాయించారు. ఈ కొత్త సబ్సిడీ రేట్లు 2026 అక్టోబర్ 1 నుండి 2027 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి. అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగినప్పటికీ, రైతులకు సరసమైన ధరలకే 28 రకాల ఎరువులను అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.




