'కాకా'లో చిరుకి జోడీగా స్నేహ!

6చూసినవారు
'కాకా'లో చిరుకి జోడీగా స్నేహ!
మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటి స్నేహను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రియమణిని పరిశీలించినా, చివరికి స్నేహనే ఖరారు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో చిరంజీవితో నటించాలన్న స్నేహ కల నెరవేరనుంది. కాగా, సినిమా విడుదల తేదీ మారనుందన్న వార్తలను చిత్ర మేకర్స్ మరోసారి ఖండించారు. 2027 జనవరి 13న సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్