సోషల్ మీడియాలో అగ్గిపెట్టి మచ్చగా సుపరిచితుడైన కిరణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 5వ తేదీన తిరుపతిలోని SVIMS ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. కిరణ్ తన హావభావాలు, డైలాగులతో సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ఆయన తరచూ మద్యం సేవిస్తూ కనిపించడంతో, అధిక మద్యపానమే అనారోగ్యానికి కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.